అక్షరటుడే, వెబ్డెస్క్ : Odisha Encounter | ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్తో మావోయిస్ట్ కీలక నేత మృతి చెందాడు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు పాక హనుమంతు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు (Nalgonda district) చెందిన పాక హనుమంతు అలియాస్ గణేష్ అలియాస్ చమ్రుతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు బుధవారం, గురువారం మధ్య రాత్రి ఒడిశాలో (Odisha) జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారని అధికారులు తెలిపారు. 67 ఏళ్ల గణేష్ నిషేధిత సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీలో సభ్యుడు. అతడిపై రూ.కోటి రివార్డు ఉంది. కళాశాల విద్యను మధ్యలోనే ఆపేసిన గణేష్, చాలా చిన్న వయస్సులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. అప్పటి నుంచి నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని తన ఇంటికి రాలేదు.
Odisha Encounter | అమిత్ షా ట్వీట్
ఒడిశా కందమాల్ ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ హతం అయ్యారని చెప్పారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. దాదాపు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా మారిందన్నారు.