అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (operation sindoor) పేరిట ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని జరిపిన ఈ దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఇందులో పలువురు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌లకు చెందిన ఐదుగురు కీలక ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. వీరు గతంలో భారత్‌పై ఉగ్రదాడులకు కుట్రపన్నారని అధికారులు తెలిపారు. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అబు జిందాల్ కూడా భారత్ దాడుల్లో మృతి చెందాడు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా మరణించారు.
