అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ దర్యాప్తునకు (SIT Investigation) సహకరించాలని ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనిన తేల్చి చెప్పింది.
క్లౌడ్, యాపిల్ క్లౌడ్‌కు (Apple Cloud) సంబంధించిన పాస్‌వర్డులను సిట్‌కు ఇవ్వాలని తేల్చి చెప్పింది. అదే సమయంలో సిట్‌కు కూడా సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారాన్ని సేకరించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. సమాచారం చెరిపేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు తేలితే ఏం చేయాలనే దానిపై తదుపరి విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.
Phone Tapping Case | సమాచారం ఇవ్వాల్సిందే..
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై మంగళవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈరోజు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినించారు.
మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Former SIB chief Prabhakar Rao) కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని.. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలని కోర్టుకు తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయన్నారు. డిజిటల్ డివైసెస్‌లో డాటా ఫార్మా చేశారని.. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌లలో డేటా ధ్వంసం చేసినట్లు న్యాయవాదులు తెలియజేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్క్‌లు అక్కడ పెట్టారన్నారు.
రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారని సుప్రీంలో వాదనలు వినిపించారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినట్లు తెలిపారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరఫున న్యాయవాదులు వాదించారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదని, సమాచారం ఇవ్వడం లేదని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సుమారు గంట పాటు సాగిన వాదనల అనంతరం జస్టిస్ బి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని ప్రభాకర్‌రావుకు సూచించింది. క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం ఇవ్వాలని, యూజర్, పాస్‌వర్డులు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Phone Tapping Case | మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు..
అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందానికి కూడా న్యాయస్థానం (Supreme Court) కొన్ని సూచనలు చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలోనే సమాచారం సేకరించాలని సూచించింది. అవసరమైన సమాచారం మాత్రమే తీసుకోవాలని తెలిపింది. ట్యాంపరింగ్ చేసినట్లు తేలితే తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై తర్వాత ఆదేశాలు ఇస్తామని పేర్కొంటూ వచ్చే నెల 18కి విచారణను వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభావకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపును ఇస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.