అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Tirupati | తిరుపతి లడ్డూ(Tirupati Laddu) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భక్తులు(Devotees) ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి (Adulterated ghee)వినియోగించారని కూటమి ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసి భక్తుల మనోభావాలను కించపరిచారని నాయకులు ఆరోపించారు. ఈ మేరకు దీనిపై విచారణకు ప్రభుత్వం సిట్(Sit) ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్న(Former TTD Chairman PA Appanna)కు సిట్ నోటీసులు ఇచ్చింది. అప్పన్నను తిరుపతి సిట్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజులుగా సిట్ ఆఫీస్‌లో ఆయనను విచారిస్తున్నారు.
