HomeతెలంగాణSheep scam | గొర్రెల స్కామ్‌లో కీలక పరిణామం

Sheep scam | గొర్రెల స్కామ్‌లో కీలక పరిణామం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sheep scam | తెలంగాణ Telanganaలో జరిగిన గొర్రెల స్కామ్ Sheep scam కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన దళారి మొయినుద్దీన్​ను moinuddin ఏసీబీ అధికారులు acb officers అరెస్ట్​ చేశారు. బీఆర్​ఎస్ brs​ హయాంలో రాష్ట్రంలో గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా లబ్ధిదారులు కొంత మొత్తం చెల్లిస్తే.. ప్రభుత్వం మిగతా డబ్బులు చెల్లించి గొర్రెలను పంపిణీ చేసింది. అయితే ఇందులో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Sheep scam | కీలక అధికారుల హస్తం..

గొర్రెల పంపిణీ స్కామ్​లో పశుసంవర్ధక శాఖ Animal Husbandry Department ఉన్నత అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు ఏసీబీకి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే 17మంది అరెస్టయ్యారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ talasani srinivas yadav​ ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండీ రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు ఈ కేసులో ఉన్నారు. అయితే ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన దళారీ మొయినుద్దీన్​ అదుపులోకి తీసుకునేలోపే దుబాయి పారిపోయారు.

Sheep scam | దుబాయి నుంచి రాగానే..

గొర్రెల స్కామ్​ను సవాల్​గా తీసుకున్న ఏసీబీ ఇప్పటికే పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులను విచారించింది. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ moinudiin​ ఇంట్లో గురువారం తనిఖీలు raids నిర్వహించింది. దుబాయిలో ఉన్న ఆయనపై గతంలోనే ఎల్​వోసీ Loc issue కూడా జారీ చేసింది.

ఈ క్రమంలో దుబాయి నుంచి శుక్రవారం మొయినుద్దీన్​ హైదరాబాద్​ రాగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్‌ కీలకంగా వ్యవహరించాడు. కాగా.. ఈ స్కామ్​లో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. దళారీ మొయినుద్దీన్​ను విచారిస్తే మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.