అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు(Prabhakar Rao)ను అరెస్ట్ చేయడానికి సిట్ యత్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)లో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గత మార్చిలో కేసు నమోదు అయింది. ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు.
Phone Tapping Case | దారులు మూసుకు పోవడంతో..
ఎస్ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికా(America) పారిపోయాడు. ఏడాదికిపైగా అక్కడే ఉండిపోయాడు. అక్కడి నుంచి రాకుండా ఉండటానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు రెడ్ కార్న్ నోటీసులు(Red Corn Notices) జారీ చేయడంతో జూన్ 8న హైదరాబాద్ వచ్చాడు. అయితే సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసి తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు కోర్టు ఆయనను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు సూచించింది. దీంతో హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్‌రావును సిట్ అధికారులు(Sit Officers) ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదని సమాచారం. దీంతో ఆయనను అరెస్ట్ చేయడానికి సిట్ యత్నిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమైంది.
Phone Tapping Case | ఢిల్లీ వెళ్లిన అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, ఏ–2 ప్రణీత్‌రావు(A-2 Praneeth Rao)ను సిట్ ఇప్పటికే పలమార్లు విచారించింది. అయితే వారు విచారణకు సహకరించకుండా సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలిసింది. గతంలో సుప్రీం కోర్టు ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదని, మినహాయింపులు రద్దు చేయాలని సిట్ అధికారులు కోరనున్నారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ వేయడానికి ఇప్పటికే డీసీపీ విజయ్‌కుమార్(DCP Vijay Kumar), ACP వెంకటగిరి(ACP Venkatagiri) ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్‌ను కస్టడీకి తీసుకోవాలని సిట్ చూస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావు అరెస్ట్ అయ్యారు.