HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇండియాకు ప్రభాకర్‌రావు!

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇండియాకు ప్రభాకర్‌రావు!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: phone tapping case : తెలంగాణ ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Telangana phone tapping case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 5న సిట్​ విచారణకు ప్రభాకర్​రావు(Prabhakar Rao) హాజరవుతున్నారని తెలిసింది. విచారణకు హాజరవుతానని సిట్​కు ప్రభాకర్​రారే స్వయంగా తెలియజేసినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలతో అమెరికా నుంచి ప్రభాకర్​రావు తిరిగి రాబోతున్నారు. సిట్​ విచారణ(SIT inquiry)కు సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు ఆయన అండర్​ టేకింగ్​ లేఖ ఇవ్వడం గమనార్హం. వన్​ టైం ఎంట్రీ పాస్​పోర్టు అందిన వెంటనే ప్రభాకర్​రావు భారత్​కు రానున్నారు.

పాస్​పోర్టు అందిన మూడు రోజుల్లో భారత్​కు రావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రభాకర్​రావు కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈయన 14 నెలలుగా అమెరికా(America)లోనే ఉంటున్నారు. కాగా, ప్రభాకర్​రావును విచారిస్తే ఫోన్​ ట్యాపింగ్​ కేసు కొలిక్కి రావొచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది.

Must Read
Related News