ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు(Prabhakar Rao)ను భారత్​ రప్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు త్వరలో సఫలం కానున్నాయి.

    భారత ప్రభుత్వం పంపిన రెడ్ కార్నర్ నోటీసు(red corner notice) అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ప్రభాకర్​రావును యూఎస్​ త్వరలో భారత్​కు అప్పగించే అవకాశం ఉంది. బీఆర్​ఎస్​(BRS) హయాంలో ఎస్​ఐబీ చీఫ్(SIB Chief)​గా ఉన్న ప్రభాకర్​రావు పలువురు రాజకీయ నేతలతో పాటు జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో 2024 మార్చి 10న కేసు నమోదు కాగా.. మరుసటి రోజే ప్రభాకర్‌రావు అమెరికా పారిపోయారు. ఈ కేసును విచారిస్తున్న ఆయనను ఇండియాకు రప్పించడానికి తీవ్రంగా యత్నిస్తోంది.

    Phone Tapping Case | రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా..

    ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రభాకర్​రావు పోలీసు విచారణకు సహకరించడం లేదు. అమెరికా(America)కు వెళ్లిన ఆయన తిరిగి రాకుండా అక్కడే ఉండాలని ప్లాన్​ వేశారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో దర్యాప్తు బృందం అమెరికా ప్రభుత్వానికి పంపింది. దీంతో ఇంటర్‌పోల్‌ మార్చి 10న జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీస్‌ అమలు దిశగా యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కసరత్తు ప్రారంభించింది. కాగా జూన్ 20లోపు విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు(Nampally Court) గతంలో ఆదేశాలు జారీ చేసింది.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...