అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karnataka | కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో (Chief Minister Siddaramaiah) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం ఉదయం భేటీ అయ్యారు.
కర్ణాటకలో సీఎం మార్పు అంటూ కొంతకాలంగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు డీకే శివకుమార్‌కు (Deputy CM DK Shivakumar) సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం వారు పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని సైతం కలిశారు. అధిష్టానం సైతం దీనిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తాజాగా సిద్ధరామయ్య – డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ భేటీ నిర్వహించారు. అధిష్టానం ఆదేశాలతో వీరు సమావేశం అయ్యారు. తాను శివకుమార్‌తో అల్పాహారం తీసుకున్నానని ముఖ్యమంత్రి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఉదయం కావేరి నివాసంలో అల్పాహార సమావేశం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశానని డీకే పేర్కొన్నారు. కర్ణాటక (Karnataka) ప్రాధాన్యతలు, ముందుకు సాగాల్సిన మార్గంపై చర్చించినట్లు వెల్లడించారు.
Karnataka | సీఎం మార్పు ఉంటుందా..
శివకుమార్ అనుకూలంగా అధికారంలోకి స్పష్టమైన మార్పు జరగబోతోందని అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అల్పాహార సమావేశంలో ఇద్దరు నాయకులు శివకుమార్-సిద్ధరామయ్య రాజీ ఫార్ములాగా చెబుతున్నా.. దాని వివరాలను రూపొందించే అవకాశం ఉందని తెలిపాయి. ఈ మార్పు జరిగే వరకు శివకుమార్ సిద్ధరామయ్యకు డిప్యూటీగా ఉంటారని పేర్కొన్నాయి.
పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక యూనిట్లో కాంగ్రెస్ బహిరంగ ప్రదర్శన కోరుకోవడం లేదని, సిద్ధరామయ్య వంటి దీర్ఘకాల కాంగ్రెస్ నాయకుడిని అకస్మాత్తుగా తొలగించడం పార్టీకి హాని కలిగిస్తుందని పలువురు నాయకులు అంటున్నారు. ఇందులో భాగంగా సీఎంను మార్చకుండా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు సమాచారం. డీకే విధేయులకు మరిన్ని క్యాబినెట్ బెర్తులు (cabinet berths) లభించే అవకాశం ఉంది. నేడు సాయంత్రం పార్టీ కేంద్ర నాయకులను కలవడానికి శివకుమార్ ఢిల్లీకి వెళ్లనున్నారు.