అక్షరటుడే, ఎల్లారెడ్డి: Form A Submission | కామారెడ్డి జిల్లాలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) భాగంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధికారిక ధృవీకరణ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు జారీ చేసిన ఫాం–ఏ పత్రాలను (Form-A documents) కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అదనపు కలెక్టర్ మధుమోహన్కు అధికారికంగా అందజేశారు.
Form A Submission | ఫాం–ఏ సమర్పణతో..
ఈ ఫారం–ఏ సమర్పణతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధికారికంగా ధ్రువీకరించబడినట్లు భావిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీ గుర్తుపై పోటీచేసే అభ్యర్థులకు ఇది అత్యంత కీలకపత్రంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇవ్వడానికి సమగ్రంగా సిద్ధమైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Form A Submission | అధికారికంగా ప్రకటించేందుకు వీలు..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడానికి, గుర్తించడానికి ఫాం-ఏ (Form A) సమర్పించడం అత్యంత ముఖ్యం. దీని ద్వారా పార్టీ అధిష్టానం ఆమోదించిన అభ్యర్థులకు మాత్రమే పార్టీ గుర్తింపు లభిస్తుంది. అలాగే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది.