ePaper
More
    Homeక్రైంGadwal | తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​.. వెలుగులోకి కీలక విషయాలు

    Gadwal | తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​.. వెలుగులోకి కీలక విషయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadwal | గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువతి పెళ్లయిన నెలరోజులకే కట్టుకున్న వాడిని కడతేర్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బ్యాంక్​ మేనేజర్​(bank manager)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు.

    గద్వాలకు చెందిన తేజేశ్వర్​కు (Tejeshwar) ఏపీలోని కర్నూల్​కు చెందిన ఐశ్వర్యతో మే 17న వివాహం జరిగింది. అయితే ఆమెకు గతంలోనే కర్నూల్​లోని (Kurnool) ఓ బ్యాంక్​ మేనేజర్​తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లయిన తర్వాత ప్రియుడితో కలిసి తేజేశ్వర్​ను చంపడానికి ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా బ్యాంక్​ మేనేజర్​ తిరుమల రావు రూ.రెండు లక్షలు ఇచ్చి పరశురామ్, రాజు, నగేష్ అనే వ్యక్తులతో తేజేశ్వర్​ను హత్య చేయించాడు. అయితే ఈ కేసులో హత్య చేసిన నిందితులతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు ఇదివరకే అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితుడైన బ్యాంక్​ మేనేజర్​ తిరుమలరావును హైదరాబాద్​లో (Hyderabad) అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్‌తో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయించారు.

    Gadwal | విదేశాల్లో సెటిల్​ అవ్వాలని ప్లాన్​

    బ్యాంక్​ మేనేజర్​ తిరుమల రావుకు (Bank manager Tirumala Rao) గతంలోనే వివాహం అయింది. అయితే వారికి పిల్లలు కాలేదు. దీంతో ఆయన ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్​ వేశాడు. దీనికోసం తన భార్యను సైతం చంపాలనుకున్నాడు. తన భార్యను, తేజేశ్వర్​ను చంపి తిరుమల రావు, ఐశ్వర్య విదేశాల్లో సెటిల్ అవ్వాలని ప్లాన్​ చేశారు. అంతేకాదు వారు టికెట్లు కూడా బుక్​ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.20 లక్షల లోన్​ తీసుకున్న తిరుమల రావు అందులో నుంచి రూ.రెండు లక్షలు ఇచ్చి తేజేశ్వర్​ను హత్య చేయించాడు. మిగతా రూ.18 లక్షలు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.

    Gadwal | ఐశ్వర్య అన్నను కూడా చంపారా..

    తిరుమల రావు పనిచేసే బ్యాంక్​లో ఐశ్వర్య తల్లి సుజాత స్వీపర్​గా పని (sweeper work) చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం ఐశ్వర్యతో కూడా ఆయన వివాహేతర సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని ప్లాన్​ చేశాడు. అయితే తన తల్లి, చెల్లికి తిరుమలరావుతో ఉన్న సంబంధం నచ్చక పలుమార్లు వారిని ఐశ్వర్య అన్న నవీన్ మందలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల ఇంట్లో జారిపడి నవీన్​ మరణించినట్లు ఐశ్వర్య, సుజాత తెలిపారు. అయితే ఆయన మృతిపై కూడా పోలీసులు (Police) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బంధానికి అడ్డు వస్తున్నాడని తిరుమలరావు, ఐశ్వర్య, సుజాత అతడి చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...