అక్షరటుడే, వెబ్డెస్క్ : Tuni Incident | ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు నిందితుడిని కోర్టుకు తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కాకినాడ (Kakinada) జిల్లా తునిలో ఇటీవల నారాయణరావు అనే వ్యక్తి ఓ బాలికను తోటలోకి తీసుకు వెళ్లి అత్యాచార యత్నం చేశాడు. హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి సమీపంలోని సపోటా తోటలోకి తీసుకెళ్లాడు. అయితే ఓ యువకుడు వారిని గమనించి ప్రశ్నించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Tuni Incident | మేజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్తుండగా..
నారాయణరావు టీడీపీ నాయకుడని సమాచారం. ఈ మేరకు వీడియో తీస్తున్న యువకుడిని బెదిరించాడు. అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) స్పందించారు. చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా వాష్రూమ్ వస్తోందని నిందితుడు చెప్పాడు. దీంతో పోలీసులు వాహనాన్ని ఆపారు. అనంతరం తుని కోమటిచెరువులో నారాయణరావు దూకాడు.
Tuni Incident | చెరువు దగ్గర ఉద్రిక్తత
నారాయణరావు చెరువులో దూకడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆయన మృతదేహం లభ్యం అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే నారాయణరావు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేసేవాళ్లను పక్కకు లాగి పోలీసులు మృతదేహాన్ని తరలించారు. కాగా నారాయణరావు మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనది సూసైడ్ కాదని వారు ఆరోపిస్తున్నారు. నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా తమ సంతకాలు తీసుకున్నారని చెప్పారు. బుధవారం రాత్రి పదిన్నరకు చెరువులో దూకితే గురువారం ఉదయం 7గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ చెప్పారని ఆరోపించారు.
