అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America Shutdown | అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ రెండు బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం షట్‌డౌన్ అయింది. ఈ మేరకు వైట్‌హౌస్ (White House) ప్రకటన చేసింది.
అమెరికా (America) తర్వాతి ఆర్థిక సంవత్సరానికి అవసరమైన నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించలేదు. దీంతో అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలుకాగానే షట్‌డౌన్ అమలులోకి వచ్చింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటుంది. అయితే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రబుత్వం మూతపడింది. కాగా యూఎస్ (US) చరిత్రలోనే అది అది సుదీర్ఘమైన షట్‌డౌన్ కావడం గమనార్హం.
America Shutdown | ఏడేళ్ల తర్వాత..
కాంగ్రెస్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బడ్జెట్ ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. సెనేట్ డెమొక్రాట్లు నవంబర్ 21 వరకు ప్రభుత్వ నిధుల ప్రవాహాన్ని కొనసాగించే రిపబ్లికన్ స్టాప్‌గ్యాప్ చర్యను అడ్డుకున్నారు. దీంతో ఫెడరల్ ఏజెన్సీలు కార్యకలాపాలను మూసివేయడం ప్రారంభించాయి.
రిపబ్లికన్లు అటాచ్ చేయడానికి నిరాకరించిన ఆరోగ్య సంరక్షణ సబ్సిడీల పొడిగింపు, మెడికైడ్ కోతలను వెనక్కి తీసుకోవాలని డెమొక్రాట్లు బిల్లులో డిమాండ్ చేశారు. ట్రంప్ మంగళవారం ఈ షట్‌డౌన్ కార్యక్రమాలు, ఉద్యోగాలపై “తిరిగి మార్చలేని” కోతలకు దారితీస్తుందని హెచ్చరించారు. “షట్‌డౌన్‌ల నుంచి చాలా మంచి రావచ్చు” అని ఆయన అన్నారు. రిపబ్లికన్లు తమ పార్టీని తొలగించిన బిల్లును ఆమోదించేలా బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని సెనేట్ డెమొక్రాటిక్ నాయకుడు చక్ షుమెర్ ఆరోపించారు. డెమొక్రాట్లు ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రభుత్వాన్ని తాకట్టు పెడుతున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. కాగా ఈ షట్‌డౌన్ సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
America Shutdown | ఏం జరుగుతుంది
షట్‌డౌన్‌తో అమెరికాలో సెప్టెంబర్ ఉపాధి నివేదికలు ఆగిపోతాయి. దీనికి తోడు విమాన ప్రయాణాలు నెమ్మదించటం, సైంటిఫిక్ రీసెర్చ్ ఆగిపోవటం, సైన్యానికి చెల్లింపులు నిలిచిపోతాయి. దీంతో అమెరికా ప్రభుత్వానికి ప్రతి రోజూ 400 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం.