అక్షరటుడే, హైదరాబాద్: state cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister A. Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం(Dr. BR Ambedkar State Secretariat)లో జరిగిన కేబినెట్ సమావేశం(cabinet meeting)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ministers Ponguleti Srinivasa Reddy), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhaka), మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు. ఇకపై రిటైర్డ్ ఉద్యోగుల రీ-రిక్రూట్‌మెంట్ చేయరాదని నిర్ణయం తీసుకున్నారు.
state cabinet : కేబినెట్ నిర్ణయాల్లో ప్రధాన అంశాలు..
- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏ(DA)లు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. ఒక డీఏను తక్షణమే చెల్లిస్తారు. మరో డీఏను ఆరు నెలల తర్వాత చెల్లించాలని నిర్ణయించారు.
- ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రతి నెల కనీసం ₹700 కోట్ల చొప్పున చెల్లించి క్లియర్ చేయాలని నిర్ణయం.
- ఉద్యోగుల ఆరోగ్య అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా హెల్త్‌కేర్ ట్రస్ట్ ఏర్పాటు.
- కేడర్ ర్యాంక్ ప్రకారం గ్రామ పంచాయతీ సెక్రటరీల(Gram Panchayat Secretaries)కు గ్రేడింగ్, క్రమం తప్పకుండా డిపిసి ప్రమోషన్లు(DPC promotions).
- జిల్లా స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ(Medical Invalidation Committees)ల ఏర్పాటు.
- కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్(Nursing Directorate) ఏర్పాటు.
- అంగన్‌వాడీ వర్కర్ల(Anganwadi workers)కు ₹2 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్.
భద్రాద్రి కొత్తగూడెంలో ఇప్పటికే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కాగా, దీనికి దివంగత మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
state cabinet : స్వయం సహాయక సంఘాల సభ్యులకు శుభవార్త
ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పాలసీ లేదు. కాగా, పాలసీ లేకున్నా ప్రభుత్వం నుంచి నేరుగా ₹10 లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించారు. గతేడాది 385 మంది మరణించగా.. వారికి ₹38.5 కోట్ల పరిహారం చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
state cabinet : పల్లె దారులకు మహర్దశ
రాష్ట్రంలోని పల్లె దారులు మెరుగుపడబోతున్నాయి. గతుకుల రోడ్లకు ఇక కాలం చెల్లబోతోంది. గ్రామీణుల రవాణా కష్టాలకు పరిష్కారం లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా R&B, పంచాయతీ రాజ్ విభాగాల కింద మొత్తం 13,000 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
state cabinet : రెండో దశ మెట్రో పనులపై..
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ (Hyderabad Metro expansion)కు సంబంధించి మొత్తం 86 కి.మీ పొడవైన మార్గాన్ని ₹19,579 కోట్లతో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి వర్గం నిర్ణయించింది.