అక్షరటుడే, వెబ్‌డెస్క్: Union Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ చర్చకు వచ్చిన అంశాలపై బ్రీఫింగ్ ఇచ్చారు. జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనాభా లెక్కలకు సంబంధించి కేంద్రానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం కులగణన చేపట్టాయని చెప్పారు.
