అక్షరటుడే, వెబ్డెస్క్ : Union Cabinet | కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై పథకం ‘పూజ్య బాపూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యోజన’ పేరుతో కొనసాగనుంది.
Union Cabinet | పనిదినాలు పెంపు
కేబినెట్ సమావేశంలో మరో రెండు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. ముందుగా, పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.51 వేల కోట్లకు పైగా నిధులను కేటాయించడానికి ఆమోదం తెలిపింది. రెండోది గ్రామీణ పేద కుటుంబాలకు ఏటా కనీసం పనిదినాలను 120 రోజులకు పెంచుతూ నిర్ణయించింది.
Union Cabinet | 2005 పథకం ప్రారంభం
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం (UPA Government) ప్రవేశపెట్టింది. ఇది దేశ చరిత్రలో అతిపెద్ద గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమంగా నిలిచింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పథకాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుత మోదీ ప్రభుత్వం (Modi Government) ఈ యోజనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మహాత్మా గాంధీ గౌరవార్థం “పూజ్య బాపూ” అనే పదాలను పేరులో చేర్చడం వల్ల కొత్త ఊపిరి పోస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కేబినెట్ సమావేశంలో విస్తృత చర్చ జరిగిన అనంతరం ఈ పేరు మార్పు ప్రతిపాదనపై ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ భారత్లో పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన ఉపాధి అవకాశాల కల్పనకు మరింత బలం చేకూరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.