అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Forest Settlement Officers | రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (Additional Collectors)ని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో గతంలోనే జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించింది. అయితే ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా గతంలో జాయింట్ కలెక్టర్లు వ్యవహరించేవారు. తాజాగా కొత్త బాధ్యతలు అదనపు కలెక్టర్ల (రెవెన్యూ)కు అప్పగించారు. అడవి భూసర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి రానున్నాయి.
ఫారెస్ట్ యాక్ట్ 1967 కింద ఉత్తర్వులు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Forest Settlement Officers | వీరు ఏం చేస్తారంటే..
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారులు అటవీ హక్కుల గురించి విచారిస్తారు. నిర్దిష్ట అటవీ ప్రాంతంలో భూమి లేదా అటవీ ఉత్పత్తులపై హక్కుల గురించిన వాదనలపై విచారణలు నిర్వహించడం ప్రాథమిక విధి. ఆ భూముల హక్కుల స్వభావం, పరిధిని నిర్ణయిస్తారు. వారు క్లెయిమ్‌ల గురించి అటవీ అధికారులకు సహేతుకమైన సమాచారాన్ని అందించాలి. అటవీ శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి హద్దులు నిర్ణయిస్తారు. అవకతవకలు ఉన్నవాటిపై విచారణ నిర్వహించడం, అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడం వంటివి చేస్తారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది.
