Anti Drone System | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాక్​ బోర్డర్​లో యాంటీ డ్రోన్​ వ్యవస్థ
Anti Drone System | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాక్​ బోర్డర్​లో యాంటీ డ్రోన్​ వ్యవస్థ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anti Drone System | పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో భారత్​–పాక్​ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.

సరిహద్దుల్లో boarder ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. మరోవైపు పాకిస్తాన్​ నిత్యం కాల్పులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పంజాబ్​ ప్రభుత్వం punjab govt కీలక నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్​ సరిహద్దుల్లో border యాంటీ డ్రోన్​ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్​ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాక్​ వైపు నుంచి ఏమైనా డ్రోన్లు వస్తే వాటిని ఈ వ్యవస్థ ద్వారా కూల్చివేయవచ్చు.