అక్షరటుడే, వెబ్‌డెస్క్: Movie exhibitors | తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు(Movie exhibitors) కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber)లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. నిర్మాతలు దిల్ రాజు (Producer Dil Raju), సురేష్ బాబు (Producer Suresh Babu) సహా 60 మంది ఎగ్జిబిటర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానించారు.