ePaper
More
    HomeజాతీయంUPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారి (పర్సన్ టు మర్చంట్- P2M) చెల్లింపుల పరిమితి పెరగనుంది.

    ప్రస్తుతం ఒక రూ.లక్షగా ఉన్న పీ2ఎం పరిమితిని రూ.10 లక్షలకు పెంచనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) National Payments Corporation of India (NPCI) ప్రకటించింది. ఇది ఈ నెల 15 నుంచి అమలులోకి రానుంది.

    తద్వారా యూపీఐ ఇప్పుడు కీలక రంగాలలో పెద్ద చెల్లింపులను సులభతరం చేస్తుంది. భద్రతా ప్రోటోకాల్స్ ను కొనసాగిస్తూ అధిక-విలువ కొనుగోళ్లకు డిజిటల్ లావాదేవీలను మరింత సజావుగా చేస్తుంది.

    వినియోగదారులు నిర్దిష్ట, ధ్రువీకరించబడిన వ్యాపార వర్గాల (business categories) కు 24 గంటల్లో రూ.10 లక్షల వరకు లావాదేవీలు చేయగలరు. కేవలం వ్యక్తి నుంచి వ్యాపారి (P2M) చెల్లింపులకు మాత్రమే. అయితే పర్సన్ టు పర్సన్ (పీ2పీ) పరిమితి మాత్రం రూ.లక్ష వరకే ఉంటుంది.

    UPI limit increased : ఎంతో ప్రయోజనం..

    పెద్ద పెద్ద లావాదేవీలు చేసే వారికి ప్రస్తుత మార్పు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఉదాహరణకు, మూలధన మార్కెట్ పెట్టుబడులు, బీమా చెల్లింపులలో ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. రోజువారీ గరిష్టంగా రూ. 10 లక్షలు.

    అదేవిధంగా, ప్రభుత్వ ఈ-మార్కెట్ప్లేస్ (GEM పోర్టల్)లో – అర్వెన్స్ మనీ డిపాజిట్లు, పన్ను చెల్లింపులతో సహా – ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షల వరకు అనుమతించబడుతుంది. ఇది గతంలో రూ. 1 లక్ష వరకే పరిమితి ఉండేది.

    ప్రయాణ రంగంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెరుగుతుంది. దీనికి అదనంగా రోజువారీ పరిమితి రూ. 10 లక్షలకు చేరుకుంటుంది.

    క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు కూడా ఒకే లావాదేవీలో రూ. 5 లక్షల వరకు అనుమతించబడతాయి. అయితే 24 గంటల పరిమితి రూ. 6 లక్షలకు నిర్ణయించబడింది. లోన్, ఈఎంఐ కలెక్షన్ల కోసం వినియోగదారులు ఇప్పుడు రోజుకు రూ. 5 లక్షల వరకు చెల్లించవచ్చు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...