అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Police | తెలంగాణ పోలీస్ శాఖలో (Telangana Police Department) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు కమిషరేట్లలో మార్పులు జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీ పరిధి (GHMC limits) పెంచిన విషయం తెలిసిందే. కొత్తగా 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపింది. దీంతో నగర నగర విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు కమిషనరేట్లను మొత్తం 12 జోన్లుగా విభజించారు. నగర కమిషనరేట్ పరిధిలో ఆరు జోన్లు, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను 3 జోన్ల చొప్పున విభజించారు. ఇకపై శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు సైతం హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలోకి రానున్నాయి.
Hyderabad Police | జోన్ల వివరాలు..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గొల్కొండ, చార్మినార్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్ జోన్లు ఉంటాయి. సైబరాబాద్ కమిషనరేట్‌లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉంటాయి. శేరిలింగంపల్లిజోన్లోకి మొయినాబాద్ నుంచి పటాన్చెరు దాకా ఉండనుంది. మాదాపూర్ కూకట్పల్లి జోన్లోకి వెళ్తుంది. రాచకొండ పరిధిలో ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు ఉంటాయి. షాద్ నగర్ , చేవెళ్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌గా భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.