అక్షరటుడే, అమరావతి: AP Inter education system | ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తూ ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సమూల మార్పులు తీసుకొచ్చింది. పలు సబ్జెక్టులను కలిపి ఒకే సబ్జెక్టుగా మార్చింది. దీనికితోడు వారికి కావల్సిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.
ఇప్పటి వరకు గణితంలో 1ఏ, 1బీ ఉండగా.. వీటిని ఒకే సబ్జెక్ట్గా మార్పు చేసింది. గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులు ఉండేవి. పాస్ మార్కులు 26. కాగా, ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్‌గా నిర్ణయించింది.
100 మార్కులకు గణితం Mathematics పరీక్ష ఉంటుంది. పాస్ మార్కులు 35గా నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులపై బర్డెన్ తగ్గుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
ఇక బైపీసీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు బోటనీ, జువాలజీ వేరు వేరుగా ఉన్నాయి. వీటిని కలిపి బయాలజీగా మార్పు చేసింది.
ఈ బయాలజీ సబ్జెక్టు విషయానికి వస్తే.. ఫస్టియర్లో 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. పాస్ మార్కులు 29. సెకండియర్ లో 30 మార్కులు వస్తేనే పాస్.
AP Inter education system : ఎలక్టివ్ సబ్జెక్ట్ విధానం
ఇకపై సెకండియర్‌లో ఫిజిక్స్ physics, కెమిస్ట్రీ chemistry, బయాలజీ biology విద్యార్థులకు students 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. గతంలో ఫెయిలై పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవని ఏపీ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఏపీ విద్యాశాఖ కొత్తగా ఎలక్టివ్ సబ్జెక్ట్ విధానం తీసుకొచ్చింది. .. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది.