ePaper
More
    HomeజాతీయంNambala Keshavarao | వారిచ్చిన సమాచారంతోనే కేశవరావు ఎన్​కౌంటర్​.. మావోల సంచలన లేఖ

    Nambala Keshavarao | వారిచ్చిన సమాచారంతోనే కేశవరావు ఎన్​కౌంటర్​.. మావోల సంచలన లేఖ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Nambala Keshavarao | మావోయిస్ట్​ అగ్రనేత నంబాల కేశవరావు (Maoist top leader Nambala Keshavarao) ఇటీవల నారాయణపూర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో (encounter) మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్ట్​ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయనతో సహా 27 మంది భద్రతా బలగాలతో జరిపిన కాల్పుల్లో మరణించారు. అయితే నంబాల కేశవరావు మృతిపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో వారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Nambala Keshavarao | నిఘా వర్గాలకు ముందే తెలుసు

    మావోయిస్టు స్పెషల్‌ జోనల్‌ కమిటీ (Maoist Special Zonal Committee) పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేశవరావు 6 నెలలుగా మాడ్‌ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని వారు పేర్కొన్నారు. అయితే ఇటీవల ఆయన టీమ్​లోని ఆరుగురు సభ్యులు లొంగిపోయారని తెలిపారు. వారిచ్చిన సమాచారంతోనే కేశవరావును ఎన్​కౌంటర్​ (Keshavarao encounter) చేశారని ఆరోపించారు.

    Nambala Keshavarao | వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు

    కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించినట్లు లేఖలో (Letter) మావోయిస్టులు తెలిపారు. అయితే తమను వదిలి బయటకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని చెప్పారు. అయితే ఈ ఎన్​కౌంటర్​లో (encounter) ఏడుగురు సురక్షితంగా బయటపడ్డట్లు తెలిపారు.

    Nambala Keshavarao | కాల్పుల విరమణ ప్రకటించాం

    పాకిస్తాన్​తో కాల్పుల విరమణకు ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం (central government) తమతో చర్చలకు ఎందుకు సిద్ధంగా లేదని వారు ప్రశ్నించారు. తాము ఇప్పటికే కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదన్నారు. అయినా బలగాలు తమపై నిత్యం దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్​ను వెంటనే ఆపేయాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...