అక్షరటుడే, వెబ్డెస్క్: Kerala | స్కూల్స్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ (Friends) మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామన్. అప్పటికప్పుడు కొట్టుకోవడం కలిసి పోవడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్నప్పుడు ఇలాంటి గొడవలను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. మహా అంటే ఒకటి రెండు రోజులు మాట్లాడుకోరు. ఆ తర్వాత కలిసిపోవడం సహజం. అయితే కొందరు మాత్రం కాస్త భిన్నంగా ఉంటారు. ఆ గొడవలను మనసులోనే పెట్టుకొని స్కూల్(School) నుంచి వెళ్లిపోయినా మాట్లాడుకోరు. కాలక్రమేనా పెరిగి పెద్ద వాళ్లు అయినపుడు చిన్నతనంలో పెట్టుకున్న గొడవలు సిల్లీగా అనిపించడంతో నవ్వుకుంటారు.
Kerala | ఇవేం కక్షలు..
కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో స్కూళ్లో 4వ తరగతిలో జరిగిన గొడవకు.. ఓ వ్యక్తి 52 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో తిరిగి దాడి చేసి పగ తీర్చుకున్నాడు. కేరళలోని (Kerala) కన్నూర్ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కన్నూర్ జిల్లాలోని(Kannur district) వెల్లరికుండు గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో వీజే బేబీ అనే 62 ఏళ్ల వృద్ధుడిపై బాలకృష్ణన్, మత్తయి వలియప్లాక్కల్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. బాలకృష్ణన్ బేబీని పట్టుకోగా.. అతని ముఖం, వీపుపై మత్తయి వలియప్లాక్కల్ రాయితో కొట్టాడు. దీంతో బేబీకి తీవ్రగాయాలు కావడంతో కన్నూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో (Kannur Medical College Hospital) చేర్పించారు.
మలోంలోని ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో (Aided Upper Primary School) చదువుతున్న సమయంలో వారు ముగ్గురు కలిసి నాలుగో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అయితే ఆ సమయంలో బాలకృష్ణన్, మత్తయి వలియప్లాక్కల్‌లపై వీజే బేబీ దాడి చేశాడు. ఇది జరిగి చాలా సంవత్సరాలు కాగా.. అప్పటి నుంచి వారు ముగ్గురూ స్నేహితులుగానే ఉన్నారు. అంతేకాకుండా వారి పొలాలు పక్క పక్కనే ఉండడంతో నిత్యం కలుసుకునే వారు.
అయితే 5 దశాబ్దాల క్రితం జరిగిన గొడవలో బేబీ తమను కొట్టారని కక్ష పెంచుకున్న బాలకృష్ణన్, మత్తయి.. తాజా ఘర్షణలో అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో రెండు పళ్లు ఊడిపోగా ఆసుపత్రికి తరలించారు. తనను కొట్టినందుకు పరిహారంగా నిందితులు ఇద్దరు బాలకృష్ణన్ (Bala Krishnan), మత్తయి కలిసి రూ.1.5 లక్షలు చెల్లించాలని వీజే బేబీ డిమాండ్ చేసినట్లు సమాచారం.