HomeసినిమాKeerthy Suresh | వెండితెరపై మళ్లీ సత్తా చాటేందుకు రెడీ అయిన కీర్తి సురేష్.. లైన్‌లో...

Keerthy Suresh | వెండితెరపై మళ్లీ సత్తా చాటేందుకు రెడీ అయిన కీర్తి సురేష్.. లైన్‌లో వరుసగా భారీ ప్రాజెక్టులు !

‘నేను శైలజ’తో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కీర్తి సురేష్, అంతకుముందే చైల్డ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు ఆమెని ప‌ల‌క‌రించాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Keerthy Suresh | తెలుగు సినీ ఇండస్ట్రీ (Telugu Film Industry)లో ‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, తన నటనతో అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే, కీర్తి (Keerthy Suresh) చిన్నతనం నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

న‌ట‌న‌ ఆమె రక్తంలోనే ఉందని చెప్పాలి. ‘మహానటి’ (Mahanati)లో లెజెండరీ నటి సావిత్రి పాత్రలో జీవించింది.దాంతో ఆమెకి జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కింది. ఆ సినిమాలోని అద్భుత ప్రదర్శనకు నేషనల్ అవార్డు అందుకుని కెరీర్ పీక్స్‌లోకి చేరారు.అయితే, కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని ప్రేమించి వివాహం చేసుకున్న కీర్తి, పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ విరామం తర్వాత ఆమె తిరిగి ఫుల్ ఫోర్స్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Keerthy Suresh | వరుస ప్రాజెక్టులతో బిజీ

కీర్తి ప్రస్తుతం పలు భాషల్లో క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘రౌడీ జనార్థన్’ అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నారు. హిందీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే పీరియాడికల్ డ్రామా చేస్తున్నారు. తమిళంలో దర్శకుడు మిస్కిన్‌తో కలిసి కోర్ట్‌రూమ్ డ్రామాలో నటిస్తుండగా, మరో థ్రిల్లర్ ‘రివాల్వర్ రీటా’ లో కూడా లీడ్ రోల్ చేస్తున్నారు.మలయాళంలో ‘తొట్టం’ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా ఒకేసారి నాలుగు భాషల్లో ప్రాజెక్టులు చేయడం ద్వారా కీర్తి తన కెరీర్‌లో కొత్త దశను ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది.

పెళ్లి తర్వాత కొంత నెమ్మదించిన కీర్తి (Heroine Keerthy Suresh) ఇప్పుడు మళ్లీ పూర్తి ఉత్సాహంతో వెండితెరపై తిరిగి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ వరుస ప్రాజెక్టులతో ఆమె తిరిగి స్టార్ ర్యాంక్‌లో నిలవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజుల్లో కీర్తి నుంచి పలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇందులో కొన్ని హిట్ అయిన కూడా కీర్తి కెరీర్ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Must Read
Related News