అక్షరటుడే, ముప్కాల్: Mupkal Mandal | సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch elections) విజయం సాధిస్తే.. గ్రామంలో మార్కండేయ మందిరం నిర్మాణానికి స్థలం ఇస్తామని మాటిచ్చారు. ఈ మేరకు సర్పంచ్‌గా గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకున్నారు.
Mupkal Mandal | ముప్కాల్ గ్రామంలో..
ముప్కాల్ గ్రామంలో (Mupkal village) సర్పంచ్‌గా కొమ్ముల సాయవ్వ శ్రీనివాస్ పోటీ చేశారు. ఈ మేరకు తాను గెలిస్తే మార్కండేయ మందిరానికి (Markandeya temple) స్థలం ఇస్తానని మాటిచ్చారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఈ మేరకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం పద్మశాలి మండల అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ బ్రహ్మదండి సువర్ణ లింగం ఆధ్వర్యంలో సర్పంచ్ సాయవ్య శ్రీనివాస్ మార్కండేయ మందిర నిర్మాణం కోసం రెండు ప్లాట్లు (288 గజాలు) అందజేశారు. అలాగే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మూడు పంతల అధ్యక్షులు రాంకిషన్, లక్ష్మిరాజ్యం చిల్క సుదర్శన్, ఉప సర్పంచ్ బ్రాహ్మదండి చిన్నయ్య, జిల్లా పద్మశాలి సంఘం సభ్యుడు గురుడు దయానంద్, జక్కుల జీవన్, గంగాధర్, టెంట్ శ్రీనివాస్, చాట్ల వెంకటరమణ, మ్యాక శివకుమార్ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.