Smart phone
Smart phone | నిద్ర‌కు ముందు ఫోన్ దూరం పెట్టండి.. లేక‌పోతే చాలా దుష్ప‌రిణామాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Smart phone | ప్ర‌పంచం స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరుగుతోంది. జేబులో రూపాయి లేక‌పోయినా టెన్ష‌న్ ఉండ‌దేమో కానీ, చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం ఊపిరి ఆడ‌దు. అంత‌లా మ‌న జీవితాల‌తో స్మార్ట్‌ఫోన్ (smart phone) పెన‌వేసుకుపోయింది. ప్ర‌స్తుతం ఫోన్ (phone) లేక‌పోతే పిచ్చెక్క‌డం ఖాయ‌మ‌న్న ప‌రిస్థితి త‌లెత్తింది. దాదాపు అంద‌రూ ఫోన్ల‌కు బానిస‌ల‌య్యారు. ఉద‌యం లేచిన నుంచి రాత్రి (night) నిద్ర‌పోయే వ‌ర‌కూ గంట‌ల కొద్దీ ఫోన్ల‌లోనే మునిగి తేలుతున్నారు. చివ‌ర‌కు నిద్ర‌లోనూ ఫోన్ ప‌క్క‌నే పెట్టుకుని ప‌డుకుంటున్నారు. కానీ, ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వైద్య నిపుణులు (medical experts) చెబుతున్నారు. ఇలా సెల్ ఫోన్‌ను (cell phone) పక్కనే పెట్టుకోని నిద్రపోవడం వల్ల మెదడుకు నేరుగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ మన మెదడు, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ వ‌ల్ల క‌లిగే దుస్ప‌రిణామాలు ఏమిటో చ‌దివేసేయండి.

Smart phone | దుష్ప‌రిణామాలెన్నో..

  • మాన‌వ మెదడు నిరంతరం చురుగ్గా ఉంటుంది. ఫోన్ వాడ‌కం వ‌ల్ల మెద‌డు ప‌నితీరుపై ప్ర‌భావం చూపుతుంది. ముఖ్య‌మైన ప‌నుల‌పై ఆస‌క్తి త‌గ్గిపోయి, అవ‌న‌స‌ర వ్యాప‌కాల వైపు ఆక‌ర్షిత‌మ‌వుతుంది.
    -సెల్ ఫోన్‌ నుండి వచ్చే కాంతి నిద్రను నిరోధిస్తుంది.
  • మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.
  • త‌ర‌చూ ఫోన్ చూడ‌డం వ‌ల్ల దృష్టి లోపాలు త‌లెత్తుతాయి. పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. ఇది నిద్రలేమికి దారితీస్తుంది.
  • నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు పెరిగే అవకాశం ఉంది.
  • ఫోన్లు వేడెక్కి పేలిపోయి చ‌నిపోవ‌డం, గాయ‌ప‌డ‌డం త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం. దిండు పక్కన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయడం కూడా ప్రమాదకరం. కనీసం నిద్ర పోయే ముందైనా ఫోన్ దూరంగా పెట్టేసి ప‌డుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.