Kasula Balraj
Kasula Balraj | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

అక్షరటుడే, బాన్సువాడ: Kasula Balraj | డ్రెయినేజీల్లో చెత్తచెదారం వేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు (Agro Industries) సూచించారు. పట్టణంలోని ఒకటో వార్డులో మంగళవారం విస్తృతంగా పర్యటించి డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు.

వర్షాకాలం వచ్చిందంటే డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి నీరు నిలిచిపోతుందని స్థానికులకు వివరించారు. దీంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయని, ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా డ్రెయినేజీల్లో చెత్తాచెదారం వేయకుండా మున్సిపల్ చెత్త వాహనంలో వేయాలన్నారు. కార్యక్రమంలో అంజి రెడ్డి, నార్ల సురేష్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాలేఖ్, ఎజాజ్, బాబా, పిట్ల శ్రీధర్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.