అక్షరటుడే, వెబ్‌డెస్క్:KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( Former Chief Minister KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాళేశ్వరం కమిషన్ ఇటీవల కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసు(Commission Notice)ల్లో పేర్కొంది. కమిషన్ విచారణకు హాజరు అవుతానని కేసీఆర్ ఇటీవల తెలిపారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న అప్పటి నీటిపారుదల శాఖ మంత్రితో కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్(Erravelli Farmhouse)లో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 5న కాకుండా 11న విచారణకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌తో పాటు, మాజీ మంత్రులు హరీశ్‌రావు(Former Minister Harish Rao), ఈటల రాజేందర్(Etala Rajender)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్‌రావు, 9న ఈటలను విచారణకు రావాలని కమిషన్ పేర్కొంది. ఈ క్రమంలో కేసీఆర్ జూన్ 5కు బదులుగా 11న విచారణకు హాజరు అవుతానని కమిషన్‌కు తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన కమిషన్‌కు తెలపగా అంగీకరించింది. కాగా.. తాను విచారణకు హాజరు అవుతానని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా తెలిపిన విషయం తెలిసిందే. మరో మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరు అవుతారా..? అయితే ఏ రోజు వెళ్తారనే..? విషయాలు ఇంకా వెల్లడించలేదు.