అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Visit Nizamabad | కేసీఆర్‌కు దత్త పుత్రుడు కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లను (KTR) ఎప్పుడు అరెస్ట్ చేస్తారో బీజేపీ చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బర్ధిపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్, హరీశ్‌రావులను జైలుకు పంపాలని అర్వింద్ సవాల్ చేశారని.. సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైలుకు పంపుతామని ఆ పార్టీ నేతలు చెప్పారన్నారు. ఆ కేసును సీబీఐకి అప్పగించి ఆరు నెలలైనా ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం నేడు కూలేశ్వరంగా మారిందని.. నిధులు గోదావరి పాలయ్యాయని వ్యాఖ్యానించారు. నాడు కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ ఎలా ఉంది.. నేడు బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడాలన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డే కేసీఆర్‌ను కాపాడుతున్నారంటూ విమర్శించారు. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనను జనజీవన స్రవంతిలోకి తేవాలని బీజేపీ రాష్ట్ర రాంచందర్‌రావుకు సూచించారు.
Revanth Reddy Visit Nizamabad | ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం
బీజేపీ, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ రెండింట్లో ఏ పార్టీకి ఓటు వేసిన ఒక్కటేనన్నారు. వారికి ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని వాఖ్యానించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం, 12 ఏళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు.
Revanth Reddy Visit Nizamabad | నా తల తీసుకుంటా
తాము అధికారంలోకి వచ్చాక 70వేల మంది ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. తమను ప్రశ్నించిన వారు వస్తే లెక్కపెట్టి చూపిస్తానని.. 70వేలలో ఒక్క తల తగ్గినా.. తన తల తీసుకుంటానని వ్యాఖ్యానించారు. తాము ఉద్యోగాలు ఇస్తే కాళ్లలో కట్టే పెట్టేందుకు కోర్టుల్లో కేసులు వేశారన్నారు. నిన్న గ్రూప్–1 విషయంలో హైకోర్టు వారికి చెంప చెల్లు మనిపించిందన్నారు.
Revanth Reddy Visit Nizamabad | కులగణన చేపట్టిన ఘనత మాది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ తననను రేవంత్ ఉద్దీన్ వ్యాఖ్యానించారని.. అయినా తనకు బాధ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. 100 ఏళ్ల తర్వాత బీసీ కుగణన చేపట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. బీసీ కులగణన చేపట్టిన తనను ఆ సమయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్.. రేవంత్ గౌడ్ అని అన్నారని.. అప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించందన్నారు. ఇక మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసిన సమయంలో నన్ను.. భట్టి విక్రమార్క.. రేవంత్ మాదిగ అన్నారని.. వారిలో నన్ను కలుకున్నారన్నారని.. ఇలా రేవంత్ ముదిరాజ్, రేవంత్ యాదవ్ అంటూ అన్ని కులాల వారు తనను వాళ్ల సభ్యులుగా అనుకున్నారని.. బీజేపీ నేతలు నన్ను రేవంత్ ఉద్దీన్ అనుకున్నా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
2 comments
[…] CM Tour to Nizamabad | రెండో విడతలో జిల్లాలో… Revanth Reddy Visit Nizamabad | కేసీఆర్ దొంగ పుత్రుడు… Prashanth Reddy campaign | అభివృద్ధిని అడ్డుకున్న […]
[…] CM Tour to Nizamabad | రెండో విడతలో జిల్లాలో… Revanth Reddy Visit Nizamabad | కేసీఆర్ దత్తపుత్రుడు కి… Prashanth Reddy campaign | అభివృద్ధిని అడ్డుకున్న […]
Comments are closed.