HomeతెలంగాణKCR | కేసీఆర్ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం!

KCR | కేసీఆర్ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ కాన్వాయ్​(KCR convoy)కి ప్రమాదం తప్పింది. కేసీఆర్​ బుధవారం ఉదయం కాళేశ్వరం విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఎర్రవల్లిలోని తన ఫామ్​ హౌస్(Erravalli farmhouse)​ నుంచి విచారణ నిమిత్తం వస్తుండగా.. సికింద్రాబాద్-కార్ఖానా ప్రాంతంలో కేసీఆర్ కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(BRS MLA Vemula Prashanth Reddy) కారుకు ప్రమాదం జరిగింది. ప్రశాంత్ రెడ్డి కారును వెనుక నుంచి మరో కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. వెంటనే స్పందించిన ట్రాఫిక్​ పోలీసులు(Traffic Police) ప్రమాదానికి గురైన కారును పక్కకు తప్పించి ట్రాఫిక్​ క్లియర్​ చేశారు.