అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి, తన బావ అయిన తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. కోకాపేటలోని క్రిన్స్‌విల్లాస్‌లో ఉన్న ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
తన సోదరి లక్ష్మితో పాటు మేనల్లుడు హరీశ్‌రావు (Harish Rao) పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ మంగళవారం వేకువజామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై కేసీఆర్ (KCR) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యనారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకుముందు సత్యనారాయణ రావు మృతి విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్‌లో హరీశ్ రావును పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Harish Rao | సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి
హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుతున్నట్లు తెలిపారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక, మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) హరీశ్‌రావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హరీశ్‌రావును పరామర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, మెతుకు ఆనంద్, హరీశ్ రావును పరామర్శించారు. సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మరోవైపు, సత్యనారాయణ రావు మృతికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కవిత ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
