అక్షరటుడే, వెబ్డెస్క్ : DK Aruna | మాజీ సీఎం కేసీఆర్పై ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ (KCR) రెండేళ్ల తర్వాత నిద్ర లేచారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్రానికి శనిలా పట్టుకుందన్నారు. దీనిపై తాజాగా డీకే అరుణ స్పందించారు. కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు కేసీఆర్ రెండేళ్ల తర్వాత నిద్ర లేచాడని ఎద్దేవా చేశారు.
DK Aruna | బీజేపీ మీద ఏడుపు
కేసీఆర్ గడిచిన పదేళ్లు బీజేపీ మీదనే ఏడ్చి, ఇప్పుడు కూడా బీజేపీ మీదనే ఏడుస్తున్నారని విమర్శించారు. పాలమూరుకి ఏదో ఇప్పుడే అన్యాయం జరుగున్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. పదేళ్ల పాటు తెలంగాణని పాలించింది ఆయనే అన్న సంగతి కూడా మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేసీఆర్కు మతిమరుపు వచ్చిందన్న అనుమానం కలుగుతుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు–రంగారెడ్డి (Palamuru-Rangareddy project) ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత పదేళ్లు ఏం జరిగిందో మర్చిపోయి కేసీఆర్ మాట్లాడుతున్నారని చెప్పారు.