అక్షరటుడే, ఇందూరు: Ex Mla Bajireddy | బీఆర్ఎస్ పార్టీ బాగు కోసం కూతురైనా.. కొడుకైనా.. చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ వెనుకాడరని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో (Brs Nizamabad) మంగళవారం (ఆగస్టు 02) విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ BJP లకు అనుకూలంగా కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా ఒకేవిధమైన చర్యలు ఉంటాయని కేసీఆర్ చెప్పకనే చెప్పారన్నారు.
Ex Mla Bajireddy | రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని..
రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనిలా పట్టారని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు.
22 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు.
కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కవిత.. పక్క పార్టీలకు మద్దతిస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
హరీష్‌రావు(Harish Rao), సంతోష్‌రావుల(Santhosh Rao) పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
సమావేశంలో నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సత్యప్రకాశ్, సుజిత్ సింగ్ ఠాకూర్, గాండ్ల లింగం, బాజిరెడ్డి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.