అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR | బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్(Former MLA NVSS Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో సీఎం(CM) మారుతారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) మధ్య డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. రేవంత్రెడ్డి(Revanth Reddy) స్థానంలో కేసీఆర్ సీఎం(KCR CM) అవుతారని చెప్పారు. ఇందుకోసం బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందని ప్రభాకర్ తెలిపారు. కేటీఆర్(KTR) నాయకత్వంలో పని చేస్తానన్న హరీష్‌రావు(Harish Rao) వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. కాగా మంగళవారం హరీశ్ రావు మాట్లాడుతూ.. తాను కేసీఆర్కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని చెప్పారు. కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
