అక్షరటుడే, వెబ్‌డెస్క్: Former CM KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ ముందు కేసీఆర్ (KCR) హాజరు కానుండగా.. తెలంగాణ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
Former CM KCR | కీలక ఆదేశాలు..
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. కేసీఆర్‌పై రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నట్లు పార్టీ ప్రకటించింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు హెచ్చరిక సందేశాలను జారీ చేసింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Former CM KCR | అప్రమత్తంగాఉండాలని ఆదేశం
కేసీఆర్ విచారణ పూర్తయ్యే వరకు అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆందోళన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు.
విచారణకు హాజరవుతానన్న కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు సిట్ విచారణాధికారిగా ఉన్న ఏసీపీకి లేఖ రాశారు. ఆదివారం నందినగర్‌లోని నివాసంలో విచారిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. న్యాయవాదులతో సమాలోచనలు జరిపిన అనంతరం సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.