అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCr) కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. అక్రమాలను నిగ్గు తేల్చడంతో పాటు, మేడిగడ్డ బ్యారేజి (Medigadda Barrage) కుంగిపోవడంపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ (Justice Gosh) కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం ఈఎన్సీలు, ఇంజినీర్లు తదితర కీలక అధికారులను విచారించింది.
KCR | జూన్ 5న కమిషన్ ముందుకు..
అధికారులను విచారించి నివేదిక రూపొందించిన కమిషన్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్5న కేసీఆర్‌ను, 6న హరీశ్‌రావు, 9న ఈటల రాజేందర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ క్రమంలో పీసీ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే నేరుగా హాజరు అవుతారా.. లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతారా? అనేది తెలియాల్సి ఉంది. కేసీఆర్ అంగీకరిస్తే ఫామ్‌హౌస్‌కు కూడా విచారణ సభ్యులను పంపిస్తామని గతంలోనే కమిషన్ స్పష్టం చేసింది. అలాగే మిగతా నేతలు సైతం కమిషన్ విచారణ ఎదుర్కోనున్నారు.