అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో (KCR) మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు (KTR and Harish Rao) భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ నాయకులతో సమావేశం కానున్నారు. దీని కోసం ఆయన శనివారం ఎర్రవల్లి (Erravalli) వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా సైతం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం అయ్యారు. అక్కడి నుంచే నాయకులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్షించనున్నారు.
KCR | బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో మాట్లాడాల్సిన అంశాలపై కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో నేతల పనితీరుపై సమీక్షించనున్నారు.