అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram Commission | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Former CM KCR) కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ కోసం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి బయలు దేరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు, అవినీతిపై విచారణకు ప్రభుత్వ కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh) ఇదివరకే అధికారులతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను విచారించారు. ఈ క్రమంలో నేడు కేసీఆర్‌ను బీఆర్కే భవన్(BRK Bhavan)లో విచారించనున్నారు. దీంతో ఆయన ఉదయం 11.15 వరకు కమిషన్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు.
Kaleshwaram Commission | ఫామ్‌హౌస్‌కు ఎమ్మెల్సీ కవిత
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) బుధవారం ఉదయం వెళ్లారు. ఆయన కాళేశ్వరం విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో కవిత వెళ్లి కలిశారు. కాగా. ఇటీవల కేసీఆర్ లేఖ వివాదం తర్వాత కవిత ఫామ్‌హౌస్(Farmhouse)కు వెళ్లడం ఇదే మొదటిసారి.
Kaleshwaram Commission | కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ వద్ద కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారించనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. దీంతో బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెయిన్ గేటు వద్ద ఆందోళన చేపడుతున్న కార్యకర్తలను పోలీసులు లోనికి అనుమతించడం లేదు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.