HomeతెలంగాణKTR | కేసీఆర్​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

KTR | కేసీఆర్​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేసీఆర్​ పెద్దగా జనాల్లోకి రావడం లేదనే విషయం తెలిసిందే. అసెంబ్లీకి కూడా ఆయన వెళ్లడం లేదు. పలు సభల్లో మాత్రమే మాట్లాడారు. దీనిపై కేటీఆర్​ స్పందిస్తూ.. పబ్లిక్​లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారన్నారు. జనాలకు కూడా కేసీఆర్ విలువ తెలిసిందని వ్యాఖ్యానించారు. ఏడాదిపాటు ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పొద్దున లేస్తే కేసీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు.

KTR | పాదయాత్రకు టైం ఉంది

తాను రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతానని కేటీఆర్​ తెలిపారు. అయితే దానికి ఇంకా సమయం ఉందన్నారు. ఎన్నికలకు మూడేళ్లు ఉందని గుర్తు చేశారు. పాదయాత్ర కు తొందరేం లేదన్నారు. ప్రస్తుతానికి స్లిమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మధ్య జిమ్​కు కొంచెం గ్యాప్ ఇచ్చానని, మళ్ళీ స్టార్ట్ చేస్తానని పేర్కొన్నారు.

KTR | ముస్లింల ఓట్ల కోసమే..

మాజీ ఎంపీ అజారుద్దీన్ (Ajaruddin)​ను కాంగ్రెస్​ ఇటీవల ఎమ్మెల్సీగా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్​ స్పందించారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదన్నారు. అజారుద్దీన్ క్రికెట్​లో బాగా కట్ లు కొట్టేవారని, ఇప్పుడు ఆయనకే పెద్ద కట్ కొట్టారని ఎద్దేవా చేశారు. అజారుద్దీన్​ను సంతృప్తి పరిచేందుకు, ముస్లింల ఓట్ల కోసం ఎమ్మెల్సీ అని ప్రకటించారని కేటీఆర్​ అన్నారు.

KTR | ముడుపుల రేవంత్​రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి అని కేటీఆర్​ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్​ అండ్​ టీ కంపెనీ వాళ్లని ముడుపుల కోసం సీఎం డిమాండ్ చేశారన్నారు. అందుకే వాళ్లు మెట్రో (Metro) నడపకుండా వెళ్లిపోతామని చెప్పారన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ 4 గా గ్రీన్ కో పైన కేసు వేయలేదన్నారు. గ్రీన్ కో దగ్గర ముడుపుల కోసమే వారిపై కేసు లేదని ఆరోపించారు. గతంలో అనేక వివాదాలు ఉన్న ఎమ్మార్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి త్వరలో విక్రయించనున్నారని ఆయన చెప్పారు.

KTR | సీఎం బంధువుల కోసం ..

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్​ డిమాండ్ చేశారు. ఆర్​ఆర్​ఆర్ (RRR)​ దక్షిణం వైపు అలైన్​మెంట్​ను మార్చారన్నారు. అక్కడ సీఎం రేవంత్​రెడ్డి బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారని ఆయన ఆరోపించారు. వారి కోసమే అలైన్​మెంట్​ మార్చారన్నారు. దీంతో మొత్తం అలైన్​మెంట్​ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.