అక్షరటుడే, ఇందూరు : KCR Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చిన వ్యక్తి కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (MLA Jeevan Reddy) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అమరువీరుల పార్కులో స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష (KCR Deeksha Divas)కు కూర్చుంటే పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారని.. అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టిన పోరాటంతో డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta), మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జడ్పీఛైర్మన్ విఠల్ రావు, ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ నీతూకిరణ్, ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.