అక్షరటుడే, కామారెడ్డి/బాన్సువాడ: Minister Jupally | బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆరేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన నియోజకవర్గ(Kamareddy Constituency) కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో, బాన్సువాడ పట్టణంలో మాట్లాడారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ అప్పులకు ప్రతి నెల ప్రభుత్వం వడ్డీ కడుతోందన్నారు. అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామన్నారు. ఉగ్రవాదంపై (Terrorism) కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందని, అమెరికా (America) మాట విని మధ్యలోనే ఆపరేషన్ ఆపడం సరికాదన్నారు. నాడు ఇందిరాగాంధీ(Indira Gandhi) ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిందని గుర్తు చేశారు.
ప్యాకేజీ–22 పనులను ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేస్తుందన్నారు. భూసేకరణ నిధుల కోసం ఇరిగేషన్ మంత్రిని (Irrigation Minister) షబ్బీర్ అలీ కలిశారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali), వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
