అక్షర టుడే, వెబ్ డెస్క్: Former Minister Gangula Kamalakar | కేసీఆరే తమ నాయకుడని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేసీఆర్ కు రాసిన లేఖపై ఆయన స్పందించారు. కవిత లేఖపై ఇప్పటికే కేటిఆర్ (KTR) మాట్లాడారని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలపై కవిత నేరుగా మాట్లాడితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదన్నారు. అవి ఊహాగానాలు అని గంగుల కొట్టి పారేశారు. ఆమె కొత్త పార్టీ పెడితే అప్పుడు మాట్లాడుతున్నారు. తమ బాస్ ఎప్పటికీ కేసీఆర్ అని స్పష్టం చేశారు.
