- Advertisement -
HomeతెలంగాణKaleshwaram Commission | ముగిసిన కేసీఆర్ విచారణ

Kaleshwaram Commission | ముగిసిన కేసీఆర్ విచారణ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) విచారణ ముగిసింది. కమిషన్​ ఛైర్మన్​ పీసీఘోష్(PC Ghosh) కేసీఆర్​ను ఫేస్​ టూ ఫేస్​ విచారించారు. మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​ను కమిషన్​ బహరంగంగా విచారించింది. కేసీఆర్​ను కూడా బహిరంగ విచారణకు పిలిచింది. అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కేసీఆర్​ కోరారు. దీంతో పీసీ ఘోస్​ కేసీఆర్​ను వ్యక్తిగతంగా విచారించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై కమిషన్​ కేసీఆర్​ను ప్రశ్నించింది. తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్​కు మాజీ వివరించినట్లు సమాచారం. 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు పీసీ ఘోష్ కమిషన్​కు అందించారు. కాగా మరికొద్ది సేపట్లో ఆయనకు కమిషన్​ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News