HomeతెలంగాణMaganti Gopinath | కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

Maganti Gopinath | కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maganti Gopinath | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్(KCR)​ మాగంటి గోపినాథ్ (Maganti Gopinath )​ భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ ఆదివారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్​లోని నివాసానికి తరలించారు.

మాగంటి మృతి విషయం తెలుసుకున్న కేసీఆర్​ ఎర్రవల్లి ఫామ్​హౌస్​ (Erravalli Farm House) నుంచి నేరుగా ఆయన ఇంటికి చేరుకున్నారు. గోపినాథ్​ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన కేసీఆర్​ కంటతడి పెట్టారు. అనంతరం మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, కేటీఆర్ సహా.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. కాగా.. కాసేపట్లో అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.