HomeతెలంగాణKCR | కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం

KCR | కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: KCR : భారాస అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(former Telangana Chief Minister KCR) హెల్త్ బులెటిన్​ను యశోద ఆసుపత్రి(Yashoda Hospital) యాజమాన్యం విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. కేసీఆర్​ షుగర్ లెవెల్స్ కాస్త పెరిగినట్లు తెలిపింది. సోడియం లెవెల్స్ తగ్గాయని వివరణ ఇచ్చింది.

KCR : నీరసంగా ఉండటంతో..

కేసీఆర్​కు నీరసంగా ఉండటంతో గురువారం (జులై 3) సాయంత్రం సికింద్రాబాద్​లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన శరీరంలో షుగర్​ లెవెల్స్ అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సోడియం స్థాయి మాత్రం తగ్గినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

కాగా, షుగర్ లెవెల్స్‌(sugar levels) ను కంట్రోల్‌లోకి తెచ్చి, సోడియం లెవెల్స్‌ sodium levels ను పెంచుతున్నట్లు యశోద ఆసుపత్రి డాక్టర్ ఏంవీ రావు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.