అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SIT notice to KCR | ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సిట్ అధికారులు మరోసారి మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు నోటీసులు అందించారు. ఆదివారం విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులు ఇటీవల దూకుడు పెంచిన విషయం తెలిసిందే. గతంలో అధికారులను విచారించి, బాధితుల స్టేట్మెంట్లు రికార్డు చేసిన పోలీసులు ఇటీవల వరుసగా బీఆర్ఎస్ (BRS) ముఖ్యనాయకులను విచారణకు పిలుస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావును తొలుత విచారించారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ ఎంపీ సంతోష్‌రావును సైతం ప్రశ్నించారు. ఈ క్రమంలో గురువారం కేసీర్‌కు సైతం నోటీసులు అందించారు.
SIT notice to KCR | రాలేనని చెప్పడంతో..
హైదరాబాద్ నందినగర్ (Nandi Nagar)లోని కేసీఆర్ నివాసంలో గురువారం సిట్ అధికారులు నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలన్నారు. అయితే నామినేషన్ల చివరి రోజు కావడంతో తాను రాలేనని కేసీఆర్ లేఖ రాశారు. అలాగే తనకు 65 ఏళ్లకు పైగా ఉండటంతో సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం ఇంటి వద్దే విచారించాలని కోరారు. విచారణ తేదిని సిట్ అధికారులు నిర్ణయించాలన్నారు. ఎర్రవల్లి (Erravalli)లోని ఫామ్‌హౌస్‌లో విచారించాలని కోరారు. ఈ మేరకు తాజాగా సిట్ మరో నోటీసు అందించింది. ఎల్లుండి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్‌లోని నివాసంలో విచారిస్తామని తెలిపింది. ఎర్రవల్లిలో విచారించాలని కేసీఆర్ కోరగా.. న్యాయనిపుణులతో చర్చించిన సిట్ ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.