ePaper
More
    HomeతెలంగాణBJP | కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్​ కుటుంబం పాత్ర.. బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

    BJP | కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్​ కుటుంబం పాత్ర.. బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, అందులో కేసీఆర్​ కుటుంబం పాత్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు (BJP State President Ramachandra Rao) ఆరోపించారు. ఆయన బుధవారం ఆసిఫాబాద్​ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్ట్​ను ఏటీఎంలా వినియోగించుకుందన్నారు. కాళేశ్వరం అవినీతి కేసులో రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్​ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

    BJP | బీజేపీ వైపు నేతల చూపు

    కాంగ్రెస్, బీఆర్​ఎస్​ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని రామచందర్​రావు వ్యాఖ్యానించారు. అచ్చంపల్లి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former MLA Guvvala Balaraju) ఇటీవల బీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామచందర్​రావు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీలో చేరే నేతలకు ఆహ్వానం పలుకుతామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

    READ ALSO  Krishna River | కృష్ణమ్మ ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

    BJP | సీబీఐతో విచారణ చేపట్టాలి

    కాళేశ్వరం ప్రాజెక్ట్​లో (Kaleshwaram Project) పక్కా అవినీతి జరిగిందని రామచందర్​రావు అన్నారు. అందులో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR)​, మాజీ మంత్రులను ఎందుకు అరెస్ట్​ చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అవినీతి, అక్రమాలసై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు డిమాండ్​ చేశారు.

    BJP | నివేదికపై అప్పుడు స్పందిస్తాం..

    కాళేశ్వరం ప్రాజెక్ట్​ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత స్పందిస్తామని రామచందర్​రావు ఇదివరకే ప్రకటించారు. పూర్తి నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్​ చేశారు. కాగా.. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్టీ బలోపేతంపై చర్యలు చేపట్టారు. త్వరలో స్థానిక ఎన్నికలు (Local Elections) జరగనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి సూచలను చేస్తున్నారు. మంగళవారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పర్యటించిన రామచందర్​రావు బుధవారం ఆసిఫాబాద్​ జిల్లాలో పర్యటిస్తున్నారు.

    READ ALSO  Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    Latest articles

    Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్​ (Varni road) అటవీ శాఖ కార్యాలయం...

    Rajagopal Reddy | సీఎం రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | కాంగ్రెస్​ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి....

    Inter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక...

    Bear | గండి మాసానిపేట్ శివారులో ఎలుగుబంటి కలకలం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bear | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని గండి మాసానిపేట్​లో (Gandi Masanipet) ఎలుగుబండి...

    More like this

    Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్​ (Varni road) అటవీ శాఖ కార్యాలయం...

    Rajagopal Reddy | సీఎం రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | కాంగ్రెస్​ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి....

    Inter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక...