అక్షరటుడే, వెబ్డెస్క్ : BRS | బీఆర్ఎస్ రజతోత్సవ brs silver jubilee celebration వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ warangal సమీపంలోని ఎల్కతుర్తిలో elkaturthi రజతోత్సవ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ kcr సభ వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు తమ ఆటపాటలతో హోరెత్తిస్తున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో సభా స్థలానికి చేరుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బారికేడ్లు అడ్డుపెట్టడంతో 15 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని, రెండు లక్షల మంది రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసి తమకు సహకరించాలని పోలీసులను కోరారు.