Kaleshwaram Commission
Kaleshwaram Commission | బీఆర్​కే భవన్​కు చేరుకున్న కేసీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ విచారణ కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ బీఆర్​కే భవన్(BRK Bhavan)​కు చేరుకున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్​హౌస్(Erravalli Farmhouse)​ నుంచి ఆయన నేరుగా బీఆర్​కే భవన్​కు వచ్చారు. మరికాసేపట్లో జస్టిస్​ పీసీ ఘోష్(Justice PC Ghosh)​ కేసీఆర్​ను విచారించనున్నారు. భవనంలోకి కేసీఆర్​తో పాటు తొమ్మిది మందిని మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. ఆయన వెంట హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్‌, మహమూద్‌ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెళ్లారు.

Kaleshwaram Commission | ఏం చెబుతారో..

కేసీఆర్(KCR)​ కాళేశ్వరం కమిషన్​ విచారణలో ఏం చెబుతారోననే ఉత్కంఠ నెలకొంది. తాను దగ్గరుండి ప్రాజెక్ట్​ను డిజైన్​ చేయించినట్లు గతంలో కేసీఆర్​ అనేకమార్లు చెప్పుకున్నారు. కమిషన్​ ఎదుట విచారణలో అధికారులు అందరూ కేసీఆర్​ చెప్పినట్లు చేశామని ఒప్పుకున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు హరీశ్​రావు(Hraish Rao), ఈటల రాజేందర్(Eatala Rajendar)​ మాత్రం కేబినేట్​ ఆమోదం మేరకు పనులు చేపట్టామని కమిషన్​కు తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్​ ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.

Kaleshwaram Commission | భారీగా చేరుకుంటున్న గులాబీ శ్రేణులు

కేసీఆర్​ విచారణ నేపథ్యంలో బీఆర్​కే భవన్​ వద్దకు బీఆర్​ఎస్​ కార్యకర్తలు(BRS Learders) భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. బీఆర్​కే భవన్​ గేటు వద్ద వారిని అడ్డుకోగా.. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీఆర్​ఎస్​, కేసీఆర్(KCR)​కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు సైతం అక్కడ భారీగా మోహరించారు. బీఆర్​కే భవన్​లోకి ఎవరు వెళ్లకుండా దిగ్భందనం చేశారు. ఆయా మార్గాలను మూసివేశారు.